సుబ్రమణ్య స్వామి ఆలయంలో భరణికృతిక వేడుకలు
కార్వేటినగరం ఆగస్టు 5 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరంలో వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో బుధవారం ఉదయం ఆలయంలో స్వామి భరణి కృత్తిక సందర్భంగా అమ్మవార్లకు పాలు పెరుగు తేనె హరిద్రవం తో కూడిన అభిషేకం నిర్వహించారు. పుష్పాలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉభయ దాతలుగా జయమ్మ లోకనాథం, విమల ఆనందబాబు, పాలపురెడ్డి కృష్ణవేణి బాలకృష్ణారెడ్డి వారి కుటుంబ సభ్యులు కిషోర్ ప్రసాద్...