GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 1:02 am Digital Edition : GURU SWAMY

సుబ్రమణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కార్వేటినగరం ఆగస్టు 11 గరుడదాద్రి న్యూస్

కార్వేటి నగరంలో వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ఆలయంలో స్వామి అమ్మవార్లకు పాలు పెరుగు తేనె హరిద్రవం తో కూడిన అభిషేకం నిర్వహించారు. పుష్పాలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రామ్ శెట్టి రాజశేఖర్ కార్యనిర్వహణాధికారి కృష్ణ నాయక్, కమిటీ సభ్యులు ఎర్రగోటి రాధాకృష్ణ యాదవ్, వినయ్ గోవింద్ స్వామి సెల్వి అన్నా రెడ్డి తులసి అమరావతి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.