సురుటుపల్లి పళ్ళికొండేశ్వర స్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ.6.21 లక్షల ఆదాయం

60 రోజుల ఆదాయం లెక్కింపు.. అన్నదాన హుండీల ద్వారా రూ.83,261 నాగలాపురం, అక్టోబర్ 30 గరుడదాత్రి: నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి శ్రీ పళ్ళికొండేశ్వర స్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.6,21,601 ఆదాయం సమకూరింది. గురువారం ఆలయ ప్రాంగణంలో దేవదాయశాఖ రామగిరి గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి ఎం.హేమచంద్రరావు ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ డి.పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి పి.లత పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో ప్రధాన హుండీల ద్వారా రూ.5,38,340 ఆదాయం లభించగా, అన్నదాన హుండీల ద్వారా రూ.83,261 ఆదాయం సమకూరినట్లు...