నాగలాపురం, జూన్ 3 గరుడధాత్రి : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం శ్రీ మరగధవల్లి సమేత శ్రీ పల్లి కొండేశ్వరస్వామి దేవస్థానాన్ని సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు బుధవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే గారికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మరియు వారి కుటుంబ సభ్యుల పేరుతో అర్చన, హారతి కార్యక్రమాలు నిర్వహించారు.
తదనంతరం దేవస్థానం అధికారులు ఎమ్మెల్యే గారిని దుశ్శాలువతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అలాగే స్వామివారి మహా ప్రసాదాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.