సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వరుని సేవలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

నాగలాపురం, జూన్ 3 గరుడధాత్రి : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం శ్రీ మరగధవల్లి సమేత శ్రీ పల్లి కొండేశ్వరస్వామి దేవస్థానాన్ని సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే గారికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మరియు వారి కుటుంబ సభ్యుల పేరుతో అర్చన, హారతి కార్యక్రమాలు నిర్వహించారు....