సూదలగుంట షుగర్స్ రైతుల బకాయిల చెల్లింపునకు తక్షణ చర్యలు : జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, ఆగస్టు 20: సూదలగుంట షుగర్స్ యూనిట్‌–1, యూనిట్‌–2కు సంబంధించి రైతులకు, రవాణా కాంట్రాక్టర్లు, హార్వెస్టింగ్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరితగతిన ఇప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలిసి రైతుల బకాయిల అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూదలగుంట షుగర్స్‌కు సంబంధించి గతంలో ఉన్న బకాయిలు, ప్రస్తుతం చెల్లించాల్సిన మొత్తాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, బకాయిల వసూలుకు ఇప్పటివరకు...