సూర్యప్రభ వాహనంపై తేజోవంతంగా శ్రీ వేదనారాయణ స్వామి
మే 8న వైభవంగా రథోత్సవం, కల్యాణోత్సవం నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవ ఆలయ నాలుగు మాడ వీధుల్లో అత్యంత వైభవంగా సాగింది. గోవింద నామస్మరణల మధ్య భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందారు. సకల లోకాలకు తేజస్సును ప్రసాదించే సూర్యభగవానుని ప్రతీకగా సూర్యప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వడం భక్తులను ఆధ్యాత్మిక...