సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ల ఆధ్వర్యంలో గురువారం సూళ్లూరుపేట పట్టణంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలన విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీల నుంచి వేలాది మంది టీడీపీ,జనసేన, బీజేపీ నాయకులు,జనసైనికులు, వీర మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ సులూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి,నాయుడుపేట, సూళ్లూరుపేట పట్టణాల టిడిపి అధ్యక్షులు షేక్ రఫీ,ఆకుతోట రమేష్ లు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ముందడుగు వేస్తోందన్నారు. వైసీపీ హయాంలో వెళ్లిపోయిన కంపెనీలు తిరిగి వస్తున్నాయని,యువతకు ఉపాధి మెరుగుపడుతోందని తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి,నీటి సరఫరా రంగాల్లో పల్లెపల్లెకు ఫలాలు అందిస్తున్నారని,విద్యా,ఐటీ మంత్రి నారా లోకేష్ కృషితో ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేట్‌కు దీటుగా నిలిచి 10వ తరగతిలో 500, 450+ మార్కులు సాధిస్తున్నాయని కొనియాడారు. ఎమ్మెల్యే విజయశ్రీ నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి,సంక్షేమం చూస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.