సూళ్లూరుపేటలో కూటమి భారీ విజయోత్సవ ర్యాలీ

సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ల ఆధ్వర్యంలో గురువారం సూళ్లూరుపేట పట్టణంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలన విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీల నుంచి వేలాది మంది టీడీపీ,జనసేన, బీజేపీ నాయకులు,జనసైనికులు, వీర మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ సులూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి,నాయుడుపేట, సూళ్లూరుపేట పట్టణాల టిడిపి...