సూళ్లూరుపేటలో గాంధీ జయంతి వేడుకలు – మహాత్ముడి విగ్రహానికి కాంగ్రెస్ ఇంచార్జ్ కిరణ్ కుమార్ నివాళి

సూళ్లూరుపేట, అక్టోబర్ 2 గరుడధాత్రి : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డి. కిరణ్ కుమార్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న సమాజాన్ని నెహ్రూ ప్రధానిగా పునాదులు వేసి దేశాన్ని ముందుకు నడిపించారని అన్నారు. ఇందిరా గాంధీ భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయం, పేదలకు ఇళ్ల నిర్మాణంతో ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచారని కొనియాడారు.బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ...