సూళ్లూరుపేట, తడ ఎంపీడీవోలపై సస్పెన్షన్ వేటు..!

-స్వచ్ఛ రథాల నిర్వహణలో నిర్లక్ష్యం గ్రామీణ ప్రాంతాల పారిశుధ్య పర్యవేక్షణలో మరియు ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, తడ మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులను (MPDOs) సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో సూళ్లూరుపేట ఎంపీడీవో ఏవీ మురళీకృష్ణ, తడ ఎంపీడీవో డి. శేఖర్ నాయక్ ఉన్నారు. వైఫల్యాలే కారణం: గ్రామాల్లో పారిశుధ్యాన్ని...