సేఫ్ తిరుపతి మా లక్ష్యం.. ప్రజల సహకారమే మా బలం తిరుపతిలో వజ్రపహార్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు
ప్రజలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీసులు శనివారం తెల్లవారుజామున భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్టీవీ నగర్, న్యూ ఇందిరా నగర్ ప్రాంతాల్లో “వజ్రపహార్” పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీలు విస్తృత స్థాయిలో సాగాయి. పోలీస్, ఎక్సైజ్, ఆర్‌టీఏ, ఈగల్, రెవెన్యూ, ఆర్మ్డ్ రిజర్వ్, డాగ్ స్క్వాడ్ విభాగాల సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో నివాస గృహాలు, అద్దె ఇళ్లు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ...