GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 8:01 pm Digital Edition : GURU SWAMY

సొల్లు కబుర్లు ఆపండి పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయండి.. ఎమ్మెల్యే థామస్

గరుడధాత్రి న్యూస్ :
ఎస్ఆర్ పురం న్యూస్… సొల్లు కబుర్లు ఆపండి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయండి అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు ఆదివారం ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామంలో విలేజ్ క్లినిక్ ప్రారంభించారు..
అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ అన్ని కార్యక్రమాల్లో నేను ముందున్న మీరు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో వేనకున్నారు మీరు పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేస్తేనే ఇకపైన మీ పనులకుసంతకం చేస్తాను లేకుంటే సంతకాలు చేయను అని ఎమ్మెల్యే థామస్ ఆరోపించారు .. నియోజకవర్గంలో విభేదాలు వీడి అందరూ కలిసిమెలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని దిశ నిర్దేశం చేశారు… ఆరోగ్యమే మహాభాగ్యం… ఆరోగ్యం పట్ల శ్రద్ధగా తీసుకోవాలి.. గ్రామంలో విలేకరులు ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ఏపీ ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ డైరెక్టర్ చినబాబు చిట్టి బాబు నాయుడు, జనసేన ఇంచార్జ్ యుగంధర్,, మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప నాయుడు మాజీ ఎంపీపీ ఇందిరమ్మ, పద్మాపురం టిడిపి యువ నాయకుడు వాసు నాయుడు, జ్యోతి నాయుడు, శ్యామ్ నాయుడు బాలాజీ నాయుడు, నాయకులు తదితరులు పాల్గొన్నారు