స్టాపింగ్ ఉన్నా ఆగని పల్లె వెలుగు బస్సు
-ప్రయాణికుల ఆగ్రహం -డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నాగలాపురం గరుడధాత్రి న్యూస్ : నాగలాపురం టి.ఆర్. ఆర్ మండపం వద్ద అధికారిక బస్సు స్టాపింగ్ ఉన్నప్పటికీ మంగళవారం సాయంత్రం తిరుపతి నుంచి వచ్చిన పల్లె వెలుగు బస్సు అక్కడ ఆగకుండా వెళ్లిపోయిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. స్టాపింగ్ వద్ద ప్రయాణికులు ఉన్నప్పటికీ బస్సు నిలపకపోవడం ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శించారు. ఇటువంటి ఘటనల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు...