GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 8:02 am Digital Edition : GURU SWAMY

స్టార్టప్ ల ప్రోత్సాహానికి ఆర్ టిఐహెచ్ లో భాగస్వామ్యం వహించండి

* ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యా శాఖల మంత్రి నారా లోకేష్.
కుప్పం,సెప్టెంబర్ 24 (గరుడ ధాత్రి న్యూస్):

ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్, టెక్నాలజీ సంస్థ మాస్టర్ కార్డ్ ఇంక్. (యుఎస్ఎ) వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ అభిషేక్ లాహిరితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,విశాఖపట్నంలో భూమి లభ్యత, ఐటీ & జీసీసీ పాలసీ మద్దతుతో ఒక జీసీసీ / టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్టార్టప్లకు మార్గదర్శకత్వం వహించి, వాటిని ప్రోత్సహించడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్ టి ఐ హెచ్) ఫిన్స్టిక్ సలహాదారు సభ్యునిగా చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫిన్స్టిక్ రంగాల్లో సీఎస్ఆర్ ద్వారా నైపుణ్యాభివృద్ధి, పీ4 కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా విన్నవించారు.గ్లోబల్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ, కొలాబరేషన్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పేరెన్నికగన్న సిస్కో సిస్టమ్స్ ఎండీ హరీష్ కృష్ణన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,డేటా సెంటర్ ఎకోసిస్టమ్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో భారీ ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను (ఎకానమీస్ ఆఫ్ స్కేల్) సాధించడానికి, డేటా సెంటర్ వాల్యూ చైన్ మొత్తం వ్యవస్థను రాష్ట్రంలోకి ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. డేటాసెంటర్ల డిమాండ్ కు అనుగుణంగా ఎపిలో యు సి ఎస్ సర్వర్లు, స్విచ్లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్/జీసీసీని ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. హరీష్ కృష్ణన్ మాట్లాడుతూ, ఎపి ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.జర్మనీకి చెందిన ప్రముఖ ఎంటర్ ప్రైజ్ సాఫ్ట్ వేర్, క్లౌడ్, బిజినెస్ ఎఐ అభివృద్ధి సంస్థ శాప్ (ఎస్ ఏ పి) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లవ్నీష్ చనానాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ గవర్నెన్స్, ఎస్ఎంఇ డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి కోసం శాప్ ఆధ్వర్యాన డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు ఎస్ ఏ పి నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్ అందించడానికి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ తో కలిసి పనిచేయాలని అన్నారు. ఎస్ ఏ పి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చనానా స్పందిస్తూభారత్ లో ఎంటర్ప్రైజెస్, ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు, వివిధ ప్రభుత్వ విభాగాలకు తాము సాంకేతిక సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్, యాక్సెసరీస్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్ (గవర్నమెంట్ ఎఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ ఎంగేజ్ మెంట్)తో మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,ఎలక్ట్రానిక్స్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో వివో మొబైల్స్ కాంపోనెంట్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వివో సరఫరాదారుల కోసం ఒక ‘కాంపోనెంట్స్ తయారీ పార్క్’ను అభివృద్ధి చేయాలని కోరారు. వివో, దాని అనుబంధ సంస్థల వెండర్ ఎకో సిస్టం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి ఒక ‘సప్లై చైన్ సమావేశాన్ని’ నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు.