GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 5:22 am Digital Edition : GURU SWAMY

స్థానిక సంస్థల్లో 34% బీసీ రిజర్వేషన్‌పై హర్షం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం: మాజీ మార్కెటింగ్ చైర్మన్ డి.ఇ. లంగోవన్ రెడ్డి

పిచ్చాటూరు ఆగస్టు 21 గరుడధాత్రి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ మాజీ మార్కెటింగ్ చైర్మన్ డి.ఇ. లంగోవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం బీసీల రాజకీయ సాధికారతకు మరింత దోహదపడుతుందని, స్థానిక సంస్థల్లో బీసీలకు మరింత ప్రాతినిధ్యం లభించే అవకాశం ఏర్పడుతుందని లంగోవన్ రెడ్డి అన్నారు. బీసీల సంక్షేమం, అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని తెలిపారు.