* కుప్పం టిడిపి ఇన్చార్జ్ పి.ఎస్. మునిరత్నం.
కుప్పం,సెప్టెంబర్ 15 (గరుడ ధాత్రి న్యూస్): త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్.మునిరత్నం పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని శ్రీ కదిరి నరసింహస్వామి ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఎన్. కొత్తపల్లిలో పార్టీ శ్రేణులు మరింత ఐక్యంగా పనిచేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. అలాగే కుంజేగనూరు గ్రామ పంచాయతీ లో కూడా టీడీపీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలలో కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్, కార్యదర్శి ధన శేఖర్, నాయకులు ఏవి రవి, వెంకటేష్, సురేష్ బాబు పాల్గొన్నారు.