* అక్టోబర్ 2న చిత్తూరులో నిర్వహణ.
* జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్):ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026 జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 2న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ప్రకటనలో తెలిపారు
అక్టోబర్ 2, జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం సాయంత్రం 4.00 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.
జిల్లా ప్రజా పరిషత్ సమావేశ భవనం, చిత్తూరులో జరుగుతుందన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ, ప్లాస్టిక్ కాలుష్య నివారణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ కార్యకలాపాలు, స్థిరమైన వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య రంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026ను అందిస్తోందన్నారు. ఇందులో భాగంగా 2026 ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కాలంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యకలాపాల పనితీరు, వాటి మూల్యాంకనం ఆధారంగా అవార్డు విజేతలను ఎంపిక చేశారు.పారిశుద్ధ్య రంగంలో ప్రశంసనీయమైన సేవలు, అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఎంపికైన విజేతలకు జిల్లా స్థాయి అవార్డులు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.స్వచ్ఛమైన, పచ్చదనంతో కూడిన, సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ, ఎంపికైన అవార్డు విజేతలు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పై ప్రకటనలో తెలిపారు.