స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో పలమనేరు మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు
*అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే అమర్ పలమనేరు, అక్టోబర్ 08 ( గరుడ ధాత్రి ) : పలమనేరు మున్సిపాలిటీకి స్వచ్ఛ ఆంధ్ర–2026 రాష్ట్రస్థాయి అవార్డు దక్కడంపై మున్సిపల్ అధికారులు, సిబ్బందిని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ రెడ్డి గురువారం సాయంత్రం అభినందించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో పలమనేరు మున్సిపాలిటీకి అవార్డు రావడం ఎంతో గర్వకారణమని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని మున్సిపాలిటీలలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం...