స్వచ్ఛ స్వర్ణ పలమనేరు’గా తీర్చిదిద్దడమే లక్ష్యం -మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ
పలమనేరు, సెప్టెంబర్ 19 ( గరుడ ధాత్రి ) : పలమనేరును 'స్వచ్ఛ స్వర్ణ పలమనేరు'గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే "స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర ", "స్వచ్ఛతా హీ సేవా" కార్యక్రమాలను పలమనేరు పురపాలక సంఘం పరిధిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి దిశానిర్దేశంలో, మున్సిపల్ కమిషనర్ కె.లోకేశ్వర వర్మ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన సదస్సు, పారిశుద్ధ్య ర్యాలీ చేపట్టారు. ఈ...