* ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి.
కుప్పం,జులై 27 (గరుడ ధాత్రి న్యూస్): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవిష్కరించారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు రామకుప్పం మండలంలో విస్తృతంగా పర్యటించారు. నారాయణపురం తండాలో కొత్తగా ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూజలు నిర్వహించి నివాళులర్పించారు. కెంచన బల్ల గ్రామంలో జడ్పీ హైస్కూల్ ను నారా భువనేశ్వరి సందర్శించారు.స్కూల్ ఆవరణలో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్కూలు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగసముద్రంలో విద్యార్థులతో ముచ్చటించారు. రామకుప్పం మండలం, ఎస్. గొల్లపల్లి పంచాయతీ, కావలి మడుగు గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. అనంతరం పీ4 కింద పలువురు విద్యార్థులకు సైకిళ్లు , క్రీడా పరికరాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. పీ4 కింద అందిన రూ.75 వేల సాయంతో ఓ మహిళ ఏర్పాటు చేసిన కిరాణా షాపును భువనేశ్వరి ప్రారంభించారు.రామకుప్పం మండలం, పీఎంకే తాండ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి:ముఖాముఖిలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ’
2024 ఎన్నికల్లో రామకుప్పం మండలంలోని తాండాల్లో తెలుగుదేశం జెండా ఎగిరిందన్నారు.
చంద్రబాబు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కుప్పం ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో మీ అందరికీ తెలుసన్నారు. సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. నియెజకవర్గానికి ఒకేసారి 30 పరిశ్రమలు తెచ్చారు. ఈ పరిశ్రమల ద్వారా వేలమందికి ఉపాధి, ఉద్యోగా అవకాశాలు లభిస్తాయి. మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు. ఏదైనా సాధించగల శక్తి మహిళలకు ఉంది. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా మహిళలు శిక్షణ తీసుకుని ఉపాధి అవకాశాలు పొందాలి. ఒకప్పుడు బిజినెస్ అంటే నాకూ తెలీదు. ధైర్యంగా ముందుడుగు వేస్తేనే ఏదైనా సాధించగలం. గతంలో మన కుప్పానికి నీటి ఎద్దడి ఉండేది. ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణాజలాలు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల దశాబ్ధాల కల నెరవేర్చారు. నదుల అనుసంధానంతో సాగు, తాగు నీరు అందిస్తున్నారు.గత ప్రభుత్వంలో పాలన ఎలా ఉందో మీరంతా చూశారు. కనీసం స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేవు.
చంద్రబాబు సుపరిపాలన అందిస్తారనే నమ్మకంతో కూటమిని ప్రజలు గెలిపించారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ఎన్టీఆర్ భరోసా, దీపం పథకం, తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, స్త్రీ శక్తి , అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. పీఎంకే తాండాలో అర్హులందరికీ సంక్షేమం అందుతోంది. పంచాయతీ పరిధిలో రూ.75 లక్షలతో సీసీ రోడ్లు, రూ.30 లక్షలతో రహదారుల నిర్మాణం చేపట్టారు. కమ్యూనిటీ భవనాన్ని కూడా నిర్మించారు. ఈ తాండాలో గోకులం షెడ్ల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరయ్యాయి. రూ.25 లక్షలతో ఓం శక్తి దేవాలయాన్ని అభివృద్ధి చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం, సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మునుస్వామి, మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి,ఆనంద్ రెడ్డి, రామకుప్పం మండల పార్టీ అధ్యక్షులు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి కామ్రాజు నాయక్, సింగల్ బిండో చైర్మన్ మహమ్మద్ రఫీ, మాజీ సర్పంచులు సీతాపతి, శ్రీనివాసులురెడ్డి, రామ్మూర్తి, జయశంకర్,మాజీ ఎంపీటీసీ చలపతి, మాజీ వైస్ ఉపాధ్యక్షులు చిన్న కృష్ణ, క్లస్టర్ఇంచార్జ్ రవి రెడ్డి, రవి, నాగరాజు, గుణశేఖర్, రమేష్, కుప్పం, గుడిపల్లి, శాంతిపురం మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.