శ్రీకాళహస్తి ఆగస్టు 02 (గరుడ దాత్రీ న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం, దేశ ఆర్ధిక రంగాన్ని బలోపేతం చేయడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వంటివి చేపడుతూ, స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ఎన్డీయే కూటమి పాలన అందిస్తోందని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు.ఇంటింటికి తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమంలో భాగంగా, రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం యొక్క రెండేళ్ళ నమ్మకమైన పాలనాకాలంలో అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ,ఆదివారం 52 వ బూత్ కన్వీనర్ గాజుల భగత్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక 21 వ వార్డు, 52 వ బూత్, ఇందిరా నగర్ లోని ప్రజల వద్దకు వెళ్ళి కరపత్రాలను అందించి వివరించారు.
వయో భారంతో బాధపడుతున్న ఆర్తులకు అండగా నిలిచి, అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతీ నెలా ఒకటో తేదీన ఠంచన్ గా అందిస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమానికి కొత్త అర్థం చెబుతోందని, రెండేళ్ల సుపరిపాలనలో సుమారు రూ.67 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల జీవితాల్లో కొండంత ఆనందాన్ని నింపడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమ పాలనలో కొత్త చరిత్ర సృష్టించిందని కొనియాడారు.
రెండేళ్ల సుపరిపాలనలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం, పాస్టర్ల సేవలకు గుర్తింపుగా 8,427 మందికి నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తూ, అన్ని వర్గాల సంక్షేమమే తన లక్ష్యమని మరోసారి నిరూపించిందని కొనియాడారు.దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి, సామాజిక న్యాయం అందరికీ చేరేలా నిర్ణయం తీసుకోవడం వలన, రెండేళ్ల సుపరిపాలన ఎస్సీ వర్గాల్లో కొత్త ఆశలు నింపిందని కొనియాడారు.రాష్ట్రంలోని సుమారు 11 వేల మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు పాత పెన్షన్ ను పునరుద్ధరించిన సియం చంద్రబాబు నాయుడు పాలన, ఇలాగే శాశ్వతంగా ఉండాలని ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు తమ ఆకాంక్షను వెలిబుచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, తిరుపతి పార్లమెంట్ నాయి బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ కోట చంద్రశేఖర్,ఐటిడి శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడు ఖాదర్, 52 వ బూత్ కన్వీనర్ గాజుల భగత్, తిరుపతి పార్లమెంటు నాయకులు సుబ్రహ్మణ్యం,జహీర్ అహ్మద్, ముజీబ్, సంపత్, సురేష్, తెలుగు మహిళా నాయకురాలు కె.విజయ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.