స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్

కుప్పం, అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు, చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్చార్జ్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుప్పం సమీపంలోని పరమ సముద్రం వద్ద శ్రీ బేటరాయ స్వామి కొండ కింద శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ నుదుటన తిలకం దిద్ది, తలపై పట్టు వస్త్రాలతో మేళతాళాల నడుమ కల్యాణోత్సవ ప్రాంగణం చేరుకున్నారు. అనంతరం...