హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి దివ్య విహారం
హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి దివ్య విహారం భక్తులకు అభయప్రదానం చేసిన గోవిందుడు చెక్కభజనలు, కోలాటాలతో మారుమోగిన తిరుపతి వీధులు బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం. తిరుపతి గరుడ ధాత్రి మే 28 : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై దివ్యమంగళ స్వరూపంతో భక్తులకు దర్శనమిచ్చి అభయప్రదానం చేశారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి...