GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 8:32 pm Posted by : GURU SWAMY

హీరో శివాజీని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు

ప్రముఖ సినీ నటుడు శివాజీను కె.వి.బి పురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మండల టీడీపీ అధ్యక్షుడు మునస్వామి యాదవ్ నేతృత్వంలో ఈ భేటీ తిరుపతి నగరంలోని ఓ హోటల్‌లో జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు శివాజీతో పలు అంశాలపై చర్చించి, శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ప్రకాష్ నాయుడు, లోకయ్య నాయుడు, సర్పంచులు దొరబాబు నాయుడు, సురేష్ చౌదరి, పాలేకర్ సంఘ కన్వీనర్ వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ భేటీ స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.