GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 6:40 pm Posted by : GURU SWAMY

10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ సత్కారం

మంగళవారం తిరుపతి కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారి సారథ్యంలో, తిరుపతి జిల్లాలో నిర్వహించిన 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అన్ని మేనేజ్మెంట్లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మెమెంటోలు మరియు శాలువాలతో గౌరవించారు.

*విద్యా సంస్కరణలపై కలెక్టర్ అభినందన

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో గత రెండు సంవత్సరాల్లో విద్యాశాఖలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులను “స్ట్రీమ్, మౌంటెన్, స్కై” విభాగాలుగా వర్గీకరించి వారికి అనుగుణంగా ప్రత్యేక బోధనా విధానాలు అమలు చేయడం, 100 డేస్ యాక్షన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలు, ర్యాంకులను దినపత్రికలు, సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడం ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖను దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు చేస్తున్న కృషి గర్వకారణమని అభిప్రాయపడ్డారు.

*మేనేజ్మెంట్ వారీగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థుల వివరాలు

*APMS (మోడల్ స్కూల్స్)

తనికొండ చిద్విలాస్ –ఎర్రావారిపాలెం – 586/600 (97.67%)

కొంపాల ముని పూజిత – వెంకటగిరి – 585/600 (97.50%)

తోట రాజా – వెంకటగిరి – 585/600 (97.50%)

*AP Residential Schools (APRIES)

పాయసం ఇందు – వెంకటగిరి – 586/600 (97.67%)

వెంపర్ల సంజనా – వెంకటగిరి – 586/600 (97.67%)

పలూరు తనిష్ – ఓజిలి – 579/600 (96.50%)

*AP Social Welfare Residential Schools (APSWRS)

రాయపాటి ఏంజెల్ ప్రియా – నాయుడుపేట – 576/600 (96.00%)

రౌతు జెస్సికా – నాయుడుపేట – 571/600 (95.17%)

ఒలివా – పుత్తూరు – 570/600 (95.00%)

*AP Tribal Welfare Residential Schools (APTWRS)

భుక్య శివశంకర్ నాయక్ – రేణిగుంట – 560/600 (93.33%)

తుమ్మల మధు – రేణిగుంట – 558/600 (93.00%)

దుర్తాటి పవిత్ర – శ్రీకాళహస్తి – 556/600 (92.67%)

*BC Welfare Schools

అరుముల్ల మధు – దొరవారి సత్రం – 584/600 (97.33%)

పంచేటి సుదీప్ – కోట – 582/600 (97.00%)

యల్లంపల్లి ఇందు – చంద్రగిరి – 580/600 (96.67%)

*KGBV పాఠశాలలు

జమ్మల సన్నీ హిత – దొరవారి సత్రం – 539/600 (89.83%)

బత్తుల జెస్సీ – వెంకటగిరి – 532/600 (88.67%)

గండు లోహిత – వెంకటగిరి – 528/600 (88.00%)

*MPP & ZPP పాఠశాలలు

ఎస్ దిశిత సాయి – వరదయ్యపాలెం – 595/600 (99.17%)

ప్రసాది మొహిత్ చరణ్ సాయి – శ్రీకాళహస్తి – 591/600 (98.50%)

కన్నవరం రేఖ – వరదయ్యపాలెం – 591/600 (98.50%)

*మున్సిపల్ పాఠశాలలు

గణితాల సాయి పూజిత – శ్రీకాళహస్తి – 594/600 (99.00%)

ఓవియా – తిరుపతి అర్బన్ – 583/600 (97.17%)

కేశంసెట్టి చందన ప్రియ – తిరుపతి అర్బన్ – 580/600 (96.67%)

*ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు

సమను గీతికా రెడ్డి – తిరుపతి – 587/600 (97.83%)

కొట్టే అమని – తిరుపతి – 587/600 (97.83%)

మెడ దత్తసాయి చెరిష్మా – తిరుపతి – 584/600 (97.33%)

*స్టేట్ గవర్నమెంట్ పాఠశాలలు

గుడపాకం నిహారిక – తిరుపతి – 590/600 (98.33%)

నీరుగట్టి అక్షయ్ – పాకాల – 588/600 (98.00%)

దొడ్డగ నివేధ – సత్యవేడు – 582/600 (97.00%)

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ గోవిందరావు, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ కె.వి.ఎన్ కుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖల అధికారులు, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జిల్లాలోని విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో మరింత ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రేరణ కలుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.