10-15 రోజుల్లో చుక్కల భూములకు విముక్తి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. చుక్కల భూములకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. త్వరలో 1.90 లక్షల ఎకరాల చుక్కల భూమికి విముక్తి కల్పిస్తామన్నారు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. 10-15 రోజుల్లో చుక్కల భూములకు విముక్తి లభిస్తుంది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్పష్టమైన యాజమాన్య హక్కులు లేకుండా రెవెన్యూ రికార్డుల్లో యజమాని కాలమ్‌లో చుక్కలు పెట్టి భూముల్ని వదిలేశారు.. ఈ భూముల్ని చుక్కల భూములుగా పిలుస్తారు. ఈ భూమి ప్రభుత్వానిదా, ప్రైవేట్ వ్యక్తులదా అనేది స్పష్టత లేకపోవడంతో వివాదాలు ఉన్నచోట అధికారులు చుక్కలు పెట్టారు. ఈ...