ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు – ఇద్దరికీ గాయాలు
-హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వీఆర్వో, వీఆర్ఏ పిచ్చాటూరు గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా వడమాలపేట మండలం పరిధిలోని అంజేరమ్మ గుడి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రెవెన్యూ సిబ్బంది గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారిని ఓ కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారు పిచ్చాటూరు మండలానికి చెందిన వీఆర్వో జానకిరామయ్య, వీఆర్ఏ హేమంత్‌గా గుర్తించారు. వీరు కార్యాలయ పనుల నిమిత్తం తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అంజేరమ్మ గుడి సమీపంలో...