11 వ.క్లస్టర్ పరిధిలో జోరుగా టిడిపి ఇంటింటి ప్రచారం

కుప్పం,ఆగస్టు 20 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పురపాలక సంఘం పరిధిలోని 11వ క్లస్టర్ పరిధిలో క్లస్టర్ ఇన్‌చార్జ్ కన్నన్ ఆధ్వర్యంలో “ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం వర్షం పడుతున్నప్పటికీ కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా క్లస్టర్ ఇన్‌చార్జ్ కన్నన్‌తో పాటు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.అదేవిధంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని సంబంధిత నాయకులు, అధికారుల దృష్టికి...