12వ పిఆర్‌సి కాలం 3 ఏళ్లు పూర్తయింది… మిగిలింది 2 ఏళ్లే : పెన్షనర్ల సంఘం డిమాండ్

పలమనేరు, ఆగస్టు 07 (గరుడ దాత్రి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 12వ పిఆర్‌సి గడువులో ఇప్పటికే మూడేళ్లు పూర్తయ్యాయని, కేవలం రెండేళ్ల కాలం మాత్రమే మిగిలి ఉన్నందున వెంటనే పిఆర్‌సిని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం పలమనేరులోని పెన్షనర్ల సంఘం భవనంలో అధ్యక్షుడు రత్నారెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రత్నారెడ్డి మాట్లాడుతూ... పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల్లో తీవ్ర జాప్యం జరగడం వల్ల వారు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం...