GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 6:39 am Digital Edition : GURU SWAMY

12 నుంచి బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు

చౌడేపల్లి సెప్టెంబర్ 22 గరుడ దాత్రి న్యూస్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ఈ ఏడాది దసరా మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు అక్టోబర్ 12 నుండి 20 వరకు ఈ వేడుకలు కన్నులపండువగా సాగనున్నాయన్నారు
ఈ దసరా మహోత్సవాలలో పాల్గొనాలని భావించే ఉభయదారులు రూ. 5,116/-లు చెల్లించి అధికారిక రశీదు పొందవచ్చునన్నారు మరిన్ని వివరాలకు బోయకొండ కార్యాలయం నందు సంప్రదించాలని ఆయన కోరారు