GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 9:04 pm Digital Edition : GURU SWAMY

మామ మందలించాడని మామను మట్టుపెట్టిన అల్లుడు – పూతలపట్టు మండలంలో ఘటన

పూతలపట్టు ఆగస్ట్ 16 (గరుడ దాత్రి న్యూస్) మామ అల్లుడ్ని మందలించినందుకు పిల్లనిచ్చిన మామని హతమార్చిన ఘటన పూతలపట్టు మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు పూతలపట్టు మండలం పేట అగ్రహారం ఎస్టీ కాలనీ చెందిన సుబ్రమణ్యం తన కూతుర్ని 2007లో అశోక్ ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు ఇక్కడే మామ దగ్గరే ఇల్లరికం తో మామ అల్లుడు కలిసిమెలిసి ఉన్నారు. గత ఆరు నెలలుగా అల్లుడు అశోక్ ప్రతిరోజు పేకాట ఆన్లైన్ బెట్టింగులు చేస్తూ ఉన్నాడని తెలుసుకున్న మామ అల్లుడిని తరచూ మందలించేవాడు.ఈ నేపథ్యంలో ఆదివారం కూడా అల్లుడు పేకాట ఆడి ఇంటికి వచ్చాడు అతని తీరుమారకపోవడంతో ఇంటికి రాగానే అల్లుడ్ని మామ సుబ్రమణ్యం గట్టిగా మందలించాడు దీంతో నన్నే నువ్వుమందలిస్తూఅవమానిస్తావా అని కోపంతో మామ సుబ్రమణ్యం చాతిపై కుటుంబ సభ్యులు ఎదుటే పిడుగులు గుద్దడంతో మామ ఊపిరాడక అక్కడకక్కడే మృతి చెందాడు. మామ మృతి చెందాడని తెలుసుకొని అశోక్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పూతలపట్టు సిఐ తిమ్మయ్య సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించి మృతి చెందిన సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నాడు.