శ్రీసిటీలో అలరించిన సంగీత విభావరి
శ్రీసిటీ, ఆగస్టు 22, గరుడధాత్రి: శ్రీసిటీ ఆధ్యాత్మిక, సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శనివారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం శ్రోతలను ఎంతగానో అలరించింది. సూళ్లూరుపేట కె ఎస్ కళానిలయంకు చెందిన కుమారి కంచెర్ల చంద్రలేఖ బృందం అన్నమాచార్యులు, శ్రీరామదాసు తదితర వాగ్గేయకారుల భక్తి కీర్తనలను మధురంగా ఆలపించారు. గణపతి ప్రార్థనతో ప్రారంభమై, కుమారి మోక్షిత శ్రీమద్భగవద్గీత పఠనం అనంతరం చంద్రలేఖ, వంశీ, మాచర్ల బత్తినయ్య భక్తి గీతాలతో సంగీత విభావరి కార్యక్రమం శ్రవణానందంగా, రసమయ భరితంగా...