1980s’ పేరుతో నకిలీ యాప్స్.. నెటిజన్లకు సైబర్ మోసం!
అమరావతి సెప్టెంబర్ 11 గరుడధాత్రి: 1980ల నాటి ఫొటోలను ఎడిట్ చేసుకునేందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న యాప్స్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ‘1980s’ పేరుతో పలు నకిలీ యాప్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నట్లు గుర్తించారు. ఈ యాప్స్ ద్వారా ఫొటోలు ఎడిట్ చేసుకునే క్రమంలో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఇతర డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాప్స్‌ను చూసి వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవద్దని,...