25 బదిలీలు.. అయినా ప్రజాసేవలో నిలిచిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే

21 ఏళ్ల సర్వీస్‌లో ఏకంగా 25 సార్లు బదిలీ అయినా, ప్రజాసేవ పట్ల అంకితభావాన్ని కోల్పోని అధికారి తుకారాం ముండే. 2005 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి, ఎక్కడ పనిచేసినా తన నిజాయితీ, నిక్కచ్చితనంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. సోలాపూర్, నవీ ముంబై, నాగపూర్, నాసిక్ వంటి ప్రాంతాల్లో సేవలందించిన ముండే, అక్రమ ఇసుక రవాణా, పన్ను ఎగవేత, అవినీతి వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకుని ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లు, తరచూ బదిలీలు ఎదురైనా ఆయన...