40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం. కేవలం వారికే..

తిరుమల : నమ్మలేక పోతున్నారా.. అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే.పసి పిల్లల తల్లీ దండ్రులకు శిశు దర్శనం పేరుతో కేవలం 40 నిముషాల్లోనే స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం.ఎలాంటి రుసుము లేకుండా,ఆన్లైన్ బుకింగ్ టోకెన్లు లేకుండానే ఈ సౌకర్యం పొందే అవకాశం వుంది. శిశు దర్శనానికి వెళ్లే దంపతులకు ఒక సంవత్సరంలోపు పిల్లలు ఉండాలి. చిన్నారితో పాటుగా తల్లీ తండ్రికి దర్శనానికి అనుమతిస్తారు. ఒకవేళ...