GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 7:48 pm Digital Edition : GURU SWAMY

5న సదుంలో విద్యుత్ శాఖ అదాలత్ కార్యక్రమం

సదుం, గరుడ ధాత్రి ఆగస్టు 2
పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుం, సోమల మండలాలకు సంబంధించి విద్యుత్ శాఖలో సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నెల 5న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పుంగనూరు ట్రాన్స్కో. ఈ ఈ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రెండు మండలాలకు చెందిన విద్యుత్ శాఖ వినియోగదారులు తమకు విద్యుత్ శాఖ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న లోక్ అదాలత్ దృష్టికి తీసుకు వస్తే వాటిని అక్కడికి అక్కడే పరిష్కరిస్తామని అన్నారు. విద్యుత్ వినియోగదారులు బట్టువారిపల్లి వద్దవున్న సదుం 33 కెవి సబ్ స్టేషన్ ఆవరణంలో మధ్యాహ్నం మూడు గంటలకు హాజరుకావాలని చెప్పారు. రెండు మండలాలకు చెందిన గృహ, రైతన్నలు, చిన్న పరిశ్రమల వినియోగదారులు అందరు సద్వినియోగం చేసుకోవాలని ట్రాన్స్కో ఏడి నరేంద్ర కోరారు.