5 న కడప జిల్లాలో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన
* జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి శ్రీకారం. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్):వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ 'అమరజీవి జలధార' బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పర్యటించనున్నారు. రూ.30,156 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. సోమవారం ఉదయం 11.20 గంటలకు ఇద్దరు నేతలు కలిసి...