50% సబ్సిడీపై జనుము, జీలగ విత్తనాల పంపిణీ

గరుడధాత్రి న్యూస్ : నాగలాపురం మండలంలోని రైతులకు జనుము, జీలగ విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి చిట్టి బాబు బుధవారం తెలిపారు. జూలై 2 నుంచి రైతు సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానంలో విత్తనాల పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతులు ఆధార్ కార్డు, పాస్‌బుక్ లేదా 1-బి జిరాక్స్ ప్రతులతో స్వయంగా హాజరై విత్తనాలు పొందాలని సూచించారు. ఒక ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు ఒక బ్యాగు, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు గరిష్టంగా...