GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 7:50 am Posted by : GURU SWAMY

56 కోట్ల రూపాయలతో 139 దేవాలయాల నిర్మాణం

* యమగానిపల్లెలో ధర్మరాజులు స్వామి ఆలయంలో నారా భువనేశ్వరి పూజలు.
* టీటీడీ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో చేపట్టిన ధర్మరాజుల స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి.
కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే విధంగా 56 కోట్ల రూపాయలతో 139 దేవాలయాల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజులు పర్యటనలో భాగంగా రెండవ రోజు మంగళవారం గుడిపల్లి మండలంలో నారా భువనేశ్వరి విస్తృతంగా పర్యటించారు. గుడిపల్లి మండలం యామనూరులో ధర్మరాజుల స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడారు.ధర్మరాజుల స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను.
మనం చేసే పనిలోనే భగవంతుడు ఉంటాడు.
గతంలో అసెంబ్లీలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి.మా కుటుంబం ప్రజాసేవ కోసమే ఉంది. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసింది.
చంద్రబాబుపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించలేకపోయారు.
కుప్పం నియోజకవర్గంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.56కోట్లతో 139 దేవాలయాలు నిర్మిస్తున్నారు.
గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారు.
ప్రతి ఒక్కరూ పరమత సహనం పాటించాలన్నారు. ఈ కార్యక్రమాలలో టిడిపి నాయకులు సుబ్రమణి, బాబు నాయుడు, శ్రీనివాసులు, నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం కనమన పల్లి గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. స్కూల్ విద్యార్థులను ఆమె ఆపాయ్యంగా పలకరించారు. అనంతరం వారితో భువనేశ్వరి గ్రూప్ ఫోటో దిగారు. అగరం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. గ్రామంలో తాగునీటి అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల వాటర్ ట్యాంక్‌ను భువనేశ్వరి ప్రారంభించారు.