56 కోట్ల రూపాయలతో 139 దేవాలయాల నిర్మాణం
* యమగానిపల్లెలో ధర్మరాజులు స్వామి ఆలయంలో నారా భువనేశ్వరి పూజలు. * టీటీడీ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో చేపట్టిన ధర్మరాజుల స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి. కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే విధంగా 56 కోట్ల రూపాయలతో 139 దేవాలయాల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజులు పర్యటనలో భాగంగా రెండవ...