శాస్త్రోక్తంగా శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

శాస్త్రోక్తంగా శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నాగలాపురం, ఏప్రిల్ 28, (గరుడధాత్రి న్యూస్) నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో మే 1 నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుధ్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం...