80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కానిస్టేబుల్ ఆర్. రాజశేఖర్‌కు ప్రశంసా పత్రం

సత్యవేడు ఆగస్టు 15 గరుడధాత్రి : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన శ్రీ సిటీ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఆర్. రాజశేఖర్‌కు ఘనమైన గుర్తింపు లభించింది. తిరుపతి జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవనీయులైన తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సమక్షంలో కానిస్టేబుల్ ఆర్. రాజశేఖర్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలను గుర్తిస్తూ ఈ ప్రశంసా పత్రాన్ని అందించారు. పోలీస్ శాఖకు...