GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 4:12 pm Posted by : GARUDA DHATRI NEWS

భక్తులకు మజ్జిగ, వాటర్ బాటిళ్ల పంపిణీ

శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని శనివారం బండ్ల వీధి భజన మందిరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1000 మంది భక్తులకు శనివారం మజ్జిగ, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. శ్రీవారి పట్టు వస్త్రాల సారెను శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ శోభ యాత్రగా బండ్ల వీధి మీదుగా కొనసాగింది. గంగమ్మ తల్లి ఆశీస్సులు బండ్ల వీధి ప్రజలతో పాటు తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ పై ఉండాలని పులిగోరు మురళీ కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భజన మందిరం కమిటీ అధ్యక్షులు పులిగోరు ప్రభాకర్ రెడ్డి తొండమనాటి వెంకటేష్ రెడ్డి దుగాండ్ల కుమారస్వామి రెడ్డి, మురుకుంబట్టు చంద్రారెడ్డి మబ్బు శివ నారాయణ రెడ్డి గంజి సుధాకర్ రెడ్డి జానకిరామ్ రెడ్డి కోటి బండ్ల వీధి బుజ్జి చంద్రశేఖర్ రెడ్డి తొండమనాటి భూషణ్ రెడ్డి మునీశ్వర్ రెడ్డి భజన మందిరం భక్తులు పాల్గొన్నారు.