మండల అభివృద్దే ధ్యేయంగా పనిచేద్దాం – ఎమ్మెల్యే ఆది

మండల అభివృద్దే ధ్యేయంగా పనిచేద్దాం - ఎమ్మెల్యే ఆది గరుడధాత్రి : మండల అభివృద్దే ధ్యేయంగా పని చేద్దామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. శుక్రవారం వరదయ్య పాలెం ఎంపిడిఓ కార్యాలయం లో నిర్వహించిన సాదారణ సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని ప్రసంగించారు. మండలంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని నిధులు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్యే...