GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:56 pm Digital Edition : GURU SWAMY

9వ రోజుకు చేరిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’

* 23.63 లక్షల ఇళ్ల సందర్శన.
* ఇన్చార్జీలు, నేతలు ఇళ్లకెళ్లాలని లోకేష్ ఆదేశం.
కుప్పం,ఆగస్టు 04 (గరుడ ధాత్రి న్యూస్): కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి-సంక్షేమం” కార్యక్రమం విజయవంతంగా 9వ రోజుకు చేరింది. 9వ రోజు ఒక్కరోజే 3 లక్షలకు పైగా గృహాలను సందర్శించగా, తొమ్మిది రోజుల్లో మొత్తంగా 23.63 లక్షల ఇళ్లకు వెళ్లి రెండేళ్ల పాలనా విజయాలను కూటమి శ్రేణులు వివరించాయి. ఇన్ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో తప్పనిసరిగా పర్యటించాలని, క్షేత్రస్థాయిలో అలసత్వానికి తావులేకుండా సమన్వయంతో ప్రతి ఇంటికీ వెళ్లి సూపర్ సిక్స్ హామీల అమలు తీరును తెలియజేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆదేశించారు.