GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 8:13 pm Digital Edition : GURU SWAMY

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సత్యవేడు శ్రీ సిటీలో విశ్వవిద్యాలయం..

-మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

సత్యవేడు గరుడధాత్రి :

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తిరుపతి జిల్లా శ్రీ సిటీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇందుకు ఆమోదం లభించింది శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరుతో నెలకొల్పనున్నారు ఈ యూనివర్సిటీ ద్వారా నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి బాటలు పడనున్నాయి,

విద్యార్థులు చదువుకుంటూనే ఇక్కడి పరిశ్రమల్లో పనిచేసేందుకు మంచి అవకాశం దొరుకుతుంది

శ్రీ సిటీకి ఇప్పటికే కేటాయించిన భూమిలో 60 ఎకరాలు దీనికోసం వినియోగించుకోనున్నారు పాలన వ్యవహారాలు పూర్తిగా శ్రీ సిటీ యాజమాన్యం పర్యవేక్షణలోనే కొనసాగనుంది.