ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సత్యవేడు శ్రీ సిటీలో విశ్వవిద్యాలయం..

-మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం సత్యవేడు గరుడధాత్రి : ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తిరుపతి జిల్లా శ్రీ సిటీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇందుకు ఆమోదం లభించింది శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరుతో నెలకొల్పనున్నారు ఈ యూనివర్సిటీ ద్వారా నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి బాటలు పడనున్నాయి, విద్యార్థులు చదువుకుంటూనే ఇక్కడి పరిశ్రమల్లో పనిచేసేందుకు మంచి అవకాశం దొరుకుతుంది శ్రీ సిటీకి ఇప్పటికే కేటాయించిన భూమిలో 60 ఎకరాలు దీనికోసం వినియోగించుకోనున్నారు...