సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి

లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నాకు సిద్ధం: తిరుపతి డిసిసి అధ్యక్షుడు బాల గురువం బాబు హెచ్చరిక కిడ్నీ బాధితులకు చెన్నై, నెల్లూరు ప్రయాణ భారం తొలగించాలి సూళ్లూరుపేట, జూలై 21 (గరుడ ధాత్రి): సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలలో తక్షణమే డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించి, స్థానిక కిడ్నీ బాధితులను ఆదుకోవాలని తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడు బాల గురువం బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూళ్లూరుపేటలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దూర ప్రాంత ప్రయాణాలతో పేదల నరకయాతన...