మెగా పీటీఎంలో రాష్ట్ర స్థాయి విజేత విద్యార్థికి ఘన సత్కారం
గరుడదాత్రి న్యూస్ మైదుకూరు , జూలై 24 మైదుకూరు జడ్పీహెచ్‌ఎస్‌లో ప్రధానోపాధ్యాయులు రామమోహన్ అధ్యక్షతన నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) అత్యంత వైభవంగా జరిగింది. విద్యార్థుల విద్యాభివృద్ధి, ప్రతిభా ప్రోత్సాహానికి వేదికగా నిలిచిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి లాంగ్ జంప్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన ఐఈడీ విద్యార్థి ఎన్. భద్రను మెడల్, ప్రశంసాపత్రం, నగదు పారితోషికంతో ఘనంగా సత్కరించారు. సత్కార కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనై మాట్లాడుతూ, "ప్రత్యేక విద్య ఉపాధ్యాయురాలు ఎస్. సునీత మేడం అందించిన నిరంతర...